నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్‌ని ప్లాన్ చేశారు. ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు చిరంజీవిని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫెడరేషన్ నుంచి భరత్ భూషణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, రాజా రవీంద్ర, జెమినీ కిరణ్, కె.ఎల్.నారాయణ, మాదాల రవి, అనుపమ్ రెడ్డి, సి కళ్యాణ్, డైరెక్టర్ వీర శంకర్, నిర్మాత అశోక్ కుమార్, అనిల్ వల్లభనేని తదితరులు కలిసి ఆహ్వానించారు.
ఈ ఆహ్వానానికి చిరంజీవి సానుకూలంగా స్పందించడంతోపాటు, ఈ నాలుగు సంస్థల పెద్దలతో చేస్తున్న కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.