బదిలీపై ఎక్కడికి వెళ్లినా అంకిత భావంతో పనిచేయాలి: ఎంపీపీ

– ఎంపీడీఓలకు ఘన సన్మానం

నవతెలంగాణ – డిచ్ పల్లి
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ సహజమేనని బదిలీపై ఎక్కడికి వెళ్ళినా అంకితభావం పట్టుదల తో పనిచేసే అక్కడి ప్రజల ప్రజా ప్రతినిధుల అధికారుల మననాలు పొందే విధంగా చూడాలని ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్ అన్నారు. శుక్రవారం ఇందల్ వాయి మండల  కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బదిలీపై నిర్మల్ జిల్లా ముధోల్ వెళ్లిన ఎంపిడిఓ రాములు నాయక్ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఇందల్ వాయి నూతన మండలం ఏర్పడిన నాటినుండి నేటివరకు ఎంపిడిఓ గా ఉన్న రాములు నాయక్ ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేయాలన్న ముందుండి పూర్తి చేయించడంలో సఫలికృతులయ్యారన్నారు. మండల ప్రజలే కాకుండా ప్రజాప్రతినిధులు అధికారులతో సమన్వయంతో ఉంటూ పనులు చేయించి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని, బదిలీపై వెళ్లిన చోట కూడా అలాగే పనులు చేయించుకుంటూ పేరు ప్రఖ్యాతులు గావించే విధంగా చూడాలన్నారు. మండలంలో ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించడానికి అందరి సలహాలు సూచనలు వింటూనే అభివృద్ధికి కృషి చేశారని ఆయన మండలానికి చేసిన సేవలు అమోఘం అన్నారు నూతనంగా కామారెడ్డి జిల్లా బీక్నూర్ ఎంపీడీవో గా ఉన్న అనంత రావు సిబ్బందిని ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ మండలాన్ని అభివృద్ధి వైపు వెళ్ళడానికి ప్రత్యేక కృషి చేస్తారనే ఆశ భావం వ్యక్తం చేశారు. అంతకుముందు వైస్ ఎంపీపీ భూసని అంజయ్య నూతన ఎంపీడీవో అనంతరావు పంచాయతీ కార్యదర్శులు ఎంపిటిసిలు పలువురు ఎంపీడీవో గా ఉన్న సమయంలో రాములు నాయక్ చేసిన కృషిని వివరించారు. అనంతరం ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ లక్ష్మారెడ్డి,పిఅర్ ఎఈ కిషన్,జూనియర్ అసిస్టెంట్ విమలా బాయి, లింగం, ఐకెపి ఎపిఎం సువర్ణ, ఎంపీటీసీలు కచ్చకాయల అశ్విని శ్రీనివాస్, మారంపల్లి సుధాకర్, తాటిపాముల శ్రీనివాస్ గుప్తా, సుదీర్, గణేష్ ,రాజు నాయక్, గడ్కోలు శ్రీనివాస్ సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షులు లోలం సత్యనారాయణ, తాజా మాజీ సర్పంచ్ తేలు విజయ్ కుమార్, బిఅర్ఎస్ ఎస్సీ సెల్ రూరల్ కన్వీనర్ పాశం కుమార్, పంచాయతీ కార్యదర్శులు శ్రీధర్, నగేష్, భరత్, అశోక్, సువార్త, అనూష, అరుణ, సుశీల, ధర్మవరం సింగోటం యశ్వంత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.