నవతెలంగాణ – కొత్తూరు
ఆసరా పింఛన్ కోసం వెళ్లి వృద్ధురాలు తప్పిపోయిన ఘటన కొత్తూరు మున్సిపాలిటీలో గురువారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం… మున్సిపాలిటీ పరిధిలోని నారాయణగూడ కాలనీకి చెందిన ఖాజాబీ సోమవారం ఉదయం 11 గంటల సమయంలో పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి పింఛన్ డబ్బులు తెంచుకుంటానని చెప్పి ఇంట్లో నుండి బయలుదేరింది. సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టూ పక్కల వెతికి గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.