బహిర్భూమికి వెళ్లి వృద్ధుడు మృతి

నవతెలంగాణ-భిక్కనూర్
బహిర్భూమికి వెళ్లి చెరువులో పడి వృద్ధుడు మరణించిన సంఘటన భిక్కనూరు పట్టణ కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం భిక్నూర్‌ పట్టణానికి చెందిన బాల నర్సయ్య (78) తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లి వస్తానని వెళ్లి కండ్లు సరిగ్గా కనబడక ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మరణించాడు. స్థానికులు గమనించి పోలీసులకు, కుటుంబీకులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని చెరువుల నుండి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయి కుమార్ తెలిపారు.