
మద్నూర్ మండలంలోని లచ్చన్ గ్రామానికి చెందిన మట్టంవార్ పోచయ్య వయసు 65 సంవత్సరాలు . ఇతడు గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్ తో బాధపడుతుండగా ఆరు నెలల క్రితం ఆపరేషన్ జరిగినది. అప్పటినుండి ఇతడు తీవ్ర నొప్పితో బాధపడుతున్నాడు. కొంతకాలంగా నాగలగావ్ గ్రామంలో తన కూతురు ఇంటి వద్ద ఉంటూ వారి యొక్క గొర్లకు కాపలాగా ఉంటున్నాడు. నిన్న రాత్రి గొర్ల కాపలాకు వెళ్ళినాడు. ఈరోజు ఉదయం తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని గురించి వెతుకుతుండగా పెద్ద ఎక్లార గ్రామ శివారులో గల లోటెన్ చెరువు లో అతడి మృతదేహం కనపడింది. అతడు అనారోగ్య కారణంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టుగా కుటుంబ సభ్యుల అభిప్రాయం. మృతుడి భార్య లక్ష్మీబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు