నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని ముల్లంగి(బి) గ్రామంలో వృద్ధురాలు పెద్ద చెరువులో పది మృతి చెందిన సంఘటన బుదవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మేకల సాయమ్మ (60) మానసిక స్థితి బాగోలేక మూడు రోజుల క్రితం చెరువులో పడి బుదవారం తేలినట్లు తెలిపారు. స్థానికులు గమనించి పోలీసులకు సంచారం ఇచ్చారన్నారు. మృతురాలి భర్త మేకల రాములు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించామన్నారు.