ముంబయి : ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే కొత్తగా ఆల్ ఇన్ వన్ చెల్లింపు పరికరాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. పిఒఎస్, క్యూఆర్ కోడ్, స్పీకర్‌లను ఒకే పరికరంలోకి అనుసంధానించేలా దీన్ని డిజైన్ చేసినట్లు పేర్కొంది. ఈ వినూత్న ఉత్పత్తి వ్యాపారుల కోసం లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి రూపొందిం చబడిందని భారత్ పే సిఇఒ నలిన్ నేగి తెలిపారు.