
కృష్ణా జలాల హక్కుల సాధనకై ఈనెల 13న నల్లగొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఛలో నల్లగొండ సభ పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ మేరకు కృష్ణా జలాల తరలింపు, కేఆర్ఎంబీ బోర్డు విషయాలపై,ప్రజలకు తెలియజేయడానికి నిర్వహించే బహిరంగ సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాల తరలింపులో నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఈ అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మరో పోరాటం చేయడానికి కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్, నాయకులు దొంగరి శ్రీనివాస్, గోపగాని శ్రీనివాస్, వివిధ గ్రామాల తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.