– సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్
నవతెలంగాణ-నస్పూర్
వేతనాలు సక్రమంగా చెల్లించని అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ అన్నారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో కాంట్రాక్టు లవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా 16 మంది సెకండ్ ఏఎన్‌ఎంలు జిల్లాలోని వివిధ పీహెచ్‌సీలలో విధులు నిర్వహిస్తున్నారన్నారు. 2021 సంవత్సరం నుండి విధుల్లో చేరిన తర్వాత ఇప్పటివరకు సదరు ఏజెన్సీ కాంట్రాక్టర్ ప్రతి నెల వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లించే దాంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, జిఓ ప్రకారం చెల్లించడంలేదని గతంలో ఎన్నిసార్లు ఏజెన్సీ నిర్వాహకుని చెప్పిన మా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇంకా బకాయి వేతనాలు అడిగితే మమ్మల్ని బెదిరిస్తున్నాడని, కావున జీఓ ప్రకారం వేతనాలు పీఎఫ్, ఈఎస్‌ఐ సక్రమంగా చెల్లించని ఏజెన్సీని వెంటనే రద్దుచేసి నేరుగా ఎన్‌హెచ్‌ఎం ద్వారా వేతనాలు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, శ్రీలత, రాజ్యలక్ష్మి, ప్రవీణ, సంధ్య, స్రవంతి, ప్రియాంక పాల్గొన్నారు.