నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆక్సిజన్ సిలిండర్ అందజేత..

నవతెలంగాణ- రామారెడ్డి
నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ ద్వారా మంగళవారం ఇస్సన్నా పల్లి గ్రామానికి చెందిన సిద్ధం లింగం అనారోగ్యంతో బాధపడుతుండగా ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆదేశాల మేరకు నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఆక్సిజన్ సిలిండర్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ కులమతాలకు అతీతంగా, పేద ప్రజలకు సేవ చేయడానికి స్థాపించబడిందని, ఎంత సంపాదించినా, ఎంత ఎత్తు ఎదిగిన, కలగని సంతృప్తి పేద ప్రజలకు చేసే సేవలో ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వడ్ల లక్ష్మీరాజం, చింతకుంట కిషన్, బి పేట నర్సింలు, నామాల రవి, సిద్ధం బైరయ్య, రాజనర్సు, బిట్ల నర్సింగరావు, వైద్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.