పోలీసు ద్విచక్ర వాహనానికి ఢీ కొన్న ఆర్ టీసీ బస్సు

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని తిమ్మాపూర్ గేట్ సమీపంలో  ఆర్ టి సి బస్ వెనుక నుండి పోలీసు ద్విచక్ర వాహనానికి ఢీ నడంలో పోలీస్ సిబ్బందికి గాయాలు అయ్యాయి. గాంధారి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే బ్లూ కోర్టు సిబ్బంది అయినా కానిస్టేబుల్ యాదగిరి హోంగార్డ్ మోతిలాల్   మేడిపల్లి గ్రామం నందు డైలీ హండ్రెడ్ రాగా వెళ్లి తిరిగి వస్తుండగా తిమ్మాపూర్ గ్రామ సమీపంలో కానిస్టేబుల్ యాదగిరి నడిపిస్తున్న బ్లూ కోర్ట్ బైక్ ను వెనక నుండి కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా బైక్ మీద ఉన్న యాదగిరికి  కుడి భుజానికి, మరియు వెనకాల కూర్చున్న మోతిలాల్ కి, కుడి భుజానికి మరియు తలకి తీవ్ర రక్త గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం యాదగిరి హైదరాబాద్ కి మరియు మోతిలాల్ నిజామాబాద్ కి తరలించమని ఎస్.ఐ ఆంజనేయులు తెలిపారు.