నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఆన్ సాన్ పల్లి గ్రామ అభివృద్ధి భూపాలపల్లి ఏరియా సింగరేణి అధికారులు సహకరించేలా చూడాలని గ్రామ తాజా మాజీ సర్పంచ్ గుగులోతు జగన్ నాయక్ ఇటీవల రాష్ట్ర ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీదర్ బాబుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో మంత్రి దుద్దిళ్ళ ఈ నెల 20న భూపాలపల్లి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ కు లేఖ రాసి,జిఎంతో ఫోన్లో మాట్లాడినట్లుగా, అట్టి లేఖను మాజీ సర్పంచ్ జగన్, ఎంపిపి దూలం సులోచన తోపాటు గ్రామస్తులు మంత్రి ఆదేశాలతో జీఎంకు బుధవారం లేఖను అందజేశారు. కోల్ మైన్, సింగరేణి బొగ్గు తవ్వకాలకు దగ్గరలో గ్రామం ఉన్నందున భూగర్భజలాలు అడుగంటి పోతున్నట్టుగా తెలిపారు గ్రామంలో హనుమాన్,నాగులమ్మ,పోచమ్మ ఆలయాల షెడ్లు నిర్మాణాలకు కావాల్సిన సామగ్రి, బస్ స్టాప్, ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి కావాల్సిన సామగ్రి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.అలాగే గ్రామానికి వెళుతున్న నేపథ్యంలో మట్టి రోడ్లపై దుమ్ము రాకుండా మట్టి రోడ్లపై ట్యాoకర్ ద్వారా నీరు,రోడ్లకు ఇరువైపులా హైమాక్స్ లైటింగ్స్ ఏర్పాటు చేయాలని కోరారు.