భిన్న పాత్రలతో అగ్లీ స్టోరీ

‘సినిమా చూపిస్త మామ, మేము వయసుకు వచ్చాం, హుషారు’ లాంటి యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్స్‌ని నిర్మించిన లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్‌ తాజాగా నూతన దర్శకుడు ప్రణవ స్వరూప్‌తో ఓ రొమాంటిక్‌ థ్రిల్లర్‌ చేయబోతున్నారు. రియా జియా ప్రొడక్షన్స్‌ అనే కొత్త బ్యానర్‌తో కలిసి ఆయన చేస్తున్న ఈ చిత్రంలో నందు హీరోగా నటిస్తుండగా, అవికా గోర్‌ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ, ‘ఈ కథ విభిన్నమైన పాత్రలతో ఆద్యంతం ప్రేక్షకులని కట్టిపడేసేలా ఉంటుంది. కథానుగుణంగా ఈ చిత్రానికి ‘అగ్లీ స్టోరీ’ అని టైటిల్‌ని ఫిక్స్‌ చేశాం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాని రిలీజ్‌ చేస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్‌, సి హెచ్‌. సుభాషిణి, కొండా లక్ష్మణ్‌, కథ, సహ నిర్మాతలు : రాజ్‌, అశ్వనీ శ్రీకష్ణ.