శామ్ సంగ్ సాల్వ్ ఫర్ టుమారోకు అనూహ్యమైన ప్రతిస్పందన

  • 50,000కి పైగా రిజిస్ట్రేషన్స్
  •  దరఖాస్తులకు ఆఖరు తేదీ మే 31
  •  ప్రైజ్ మనీలో రూ. 1.5 కోట్లు గెలుచుకున్న టాప్ 3 జట్లు
  • ఇతర పట్టణాలతో పాటు బెగుసరాయ్, చిత్ర దుర్గ, ధార్వాడ్, గుల్బర్గా, జల్ పాయ్ గురి, ఖుర్దా, నార్త్ 24 పరగణాస్ & మధుబని వంటి చిన్న పట్టణాలు నుండి తమ ఆలోచనలు పంపిన యువత

  • ప్రముఖ 30 టీమ్స్ కు బూట్ క్యాంప్ లో  ఐఐటీ ఢిల్లీ మరియు MeitY స్టార్టప్ హబ్ లు శిక్షణ, సలహాలు

నవతెలంగాణ గురుగ్రామ్: శామ్ సంగ్ ఇండియా వారి జాతీయ విద్యా మరియు ఆవిష్కరణ పోటీ సాల్వ్ ఫర్ టుమారో కు భారతదేశం వ్యాప్తంగా యువత నుండి అనూహ్యమైన ప్రతిస్పందన లభించింది. 50,000కి పైగా రిజిస్ట్రేషన్స్ భారతదేశం నుండి వచ్చాయి. యువత ముఖ్యంగా దేశంలో చిన్న పట్టణాలు నుండి అనగా బెగుసరాయ్, చిత్ర దుర్గ, ధార్వాడ్, గుల్బర్గా , జల్ పాయ్ గురి, ఖుర్దా , నార్త్ 24 పరగణాస్, మధుబని మరియు పథానమ్ థిట్ట లు నుండి యువత తమ ఆలోచనలు పంపించారు, తమ చుట్టూ ఉన్న ప్రజల జీవితాలు పై సానుకూలమైన సామాజిక ప్రభావాన్ని కలిగి ఉండే వాస్తవిక ప్రపంచం సమస్యలను పరిష్కరించడానికి కొత్త టెక్నాలజీ పరిష్కారాలను కనుగొనాలని తమ కోరికను ప్రత్యేకించి తెలియచేసారు. తమ ఆలోచనలను కార్య రూపంలో ఉంచడానికి పోటీలో నిలిచే ప్రముఖ 3 టీమ్స్ కు రూ. 1.5 కోట్లు గెలుపొందే అవకాశం లభిస్తుంది. యువత సాల్వ్ ఫర్ టుమారో కోసం మే 31, 2023 సాయంత్రం 5 గంటలు వరకు www.samsung.com/in/solvefortomorrow దరఖాస్తు చేయవచ్చు. భారతదేశపు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ యొక్క ఫ్లాగ్ షిప్ సీఎస్ఆర్ కార్యక్రమం కొత్త పరిష్కారాలు మరియు జీవితాలను మార్చే వాటి సామర్థ్యం యొక్క శక్తిని గుర్తించింది మరియు 16-22 సంవత్సరాలు  వయస్సు గల యువత నుండి 4 కీలకమైన ఇతివృత్తాలలో – చదువు & నేర్చుకోవడం, పర్యావరణం & సుస్థిరత, ఆరోగ్యం & సంక్షేమం మరియు విభిన్నత & చేరికలలో  కొత్త ఆలోచనలను ఆహ్వానిస్తోంది. చదువు & నేర్చుకోవడం ఇతివృత్తంలో ఇప్పటి వరకు, 49% ఆలోచనలు వచ్చాయి. తమ కొత్త ఆలోచనలు వెనక 28% యువత పర్యావరణం 7 సుస్థిరతలను ఎంచుకోగా 18% దరఖాస్తులు ఆరోగ్యం & సంక్షేమం ఇతివృత్తం క్రింద వచ్చాయి మరియు 5% విభిన్నత & చేరికలు క్రింద వచ్చాయి. తమ దరఖాస్తులను పంపించిన 73% మంది 18-22 సంవత్సరాల వయస్సు శ్రేణిలో ఉన్నారు.
ఈ-వ్యర్థాల నిర్వహణ, సముద్ర ప్లాస్టిక్ వ్యర్థం రీసైక్లింగ్ చేయడం, పంపిణీ ఆర్థిక వ్యవస్థ, వాతావరణం మార్పు, వ్యవసాయ దిగుబడులు, శుభ్రమైన నీటిని కేటాయించడం, ఆరోగ్య సంరక్షణ వ్యయాలు, మానసిక ఆరోగ్యం, ప్రమాదం నివారణ, పాఠశాలలు, కళాశాలల్లో బోధనా వ్యవస్థలను మెరుగుపరచడం మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన వంటి విషయాలలో వాస్తవిక ప్రపంచం సమస్యలను పరిష్కరించడానికి భారతదేశం వ్యాప్తంగా ఉన్న యువత తమ ఆలోచనలను పంపించింది. తదుపరి స్టెప్ గా, శామ్ సంగ్ అందుకున్న దరఖాస్తులు నుండి  ప్రముఖ 30 టీమ్స్ ను ( స్వతంత్ర వ్యక్తులు లేదా 3 సభ్యులు వరకు టీమ్స్) ఎంపిక చేస్తుంది. తమ ఆలోచనలను పెంపొందించడానికి పార్టిసిపెంట్స్ కు సహాయపడటానికి గాను  ఈ ప్రముఖ 30 టీమ్స్ కు  శామ్ సంగ్ మరియు సంస్థ భాగస్వాములు – ఐఐటీ ఢిల్లీలో  ఫౌంటేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ (ఎఫ్ఐటీటీ) మరియు ఐఐటీ ఢిల్లీలో గురుకుల బూట్ క్యాంప్ లో MeitY స్టార్టప్ లో సలహాలు ఇస్తారు. ప్రారంభపు నమూనాలు రూపొందించటానికి ప్రముఖ 30 టీమ్స్ ఒక్కొక్కరు రూ. 20,000 పొందుతారు, తరువాత తమ ఆలోచనలను యువ శామ్ సంగ్ ఉద్యోగులు మరియు ఎఫ్ఐటీటీ, ఐఐటీ ఢిల్లీ మరియు MeitY స్టార్టప్ హబ్ నుండి నిపుణుల జ్యూరీకి తమ ఆలోచనలు తెలియచేస్తారు. ఈ జ్యూరీ కూడా అంతిమ కార్యక్రమం కోసం ప్రముఖ 10 టీమ్స్ ను ఎంపిక చేస్తుంది. జ్యూరీ సభ్యుల, గురువులు నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా తమ నమూనాలను పెంచడానికి  ప్రముఖ 10 టీమ్స్ లో ఒక్కొక్కటి రూ. 100,000 పొందుతుంది. ఈ జట్లకు శామ్సంగ్ ఇండియా కార్యాలయాలను, శామ్సంగ్ ఆర్ అండ్ డి కేంద్రాలను, డిజైన్ సెంటర్ను మరియు బెంగుళూరులోని శామ్సంగ్ ఒపేరా హౌస్ను సందర్శించే అవకాశం లభిస్తుంది. అక్కడ వారు శామ్సంగ్ యువ ఉద్యోగులు మరియు పరిశోధకులతో సంభాషించగలుగుతారు. ఈ వార్షిక కార్యక్రమం మూడు జాతీయ విజేతలను ప్రకటించటంతో ముగుస్తుంది. వారికి బహుమతి రుసుముగా రూ. 1.5 కోట్లు గెలిచే అవకాశం మరియు ఉత్కంఠభరితమైన శామ్సంగ్ ఉత్పత్తులు లభిస్తాయి. అమెరికాలో మొదటిసారి 2010లో ప్రారంభించిన సాల్వ్ ఫర్ టుమారో, ప్రస్తుతం అంతర్జాతీయంగా 63 దేశాల్లో నిర్వహించబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇందులో 2.3 మిలియన్ మంది యువత పాల్గన్నారు.