గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన మండలంలోని పంచగుడి బ్రిడ్జి వద్ద గల గోదావరి నదిలో చోటు చేసుకుంది. ఎస్ఐ అశోక్ తెలిపిన వివారల ప్రకారం శుక్రవారం ఉదయం దాదాపు 7 గంటల సమయంలో గుర్తు తెలియని పురుషుని మృత దేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. మృతుని యొక్క వయసు 55 నుంచి 60 సంవత్సరాలు ఉంటుందని, అతని శరీరం పై నారింజ రంగు( ఆరెంజ్) టీ షర్ట్ దరించి ఉన్నదని తెలిపారు. మృతుని యొక్క ఆచూకీ ఎవరికైనా తెలిసినచో లోకేశ్వరం పోలీసు స్టేషన్ లో లేదా మొబైల్ నెంబర్ 8712659541 ఈ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.