నగరంలోని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయిరెడ్డి మంగళవారం తెలిపారు. రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..తేది 22 రోజున ఉదయం 9 గంటలకు నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ ఇచ్చిన సమాచారం ప్రకారం అంకాపూర్ రైల్వే బ్రిడ్జి వద్ద రైలు పట్టాలపై ఒక గుర్తు తెలియని వ్యక్తి సుమారు (50) వయసు గల వ్యక్తి గుర్తు తెలియని రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. రైల్వే స్టేషన్ మేనేజర్ మిర్యాలమేరకు కేసు నమోదు చేశామని రైల్వే ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటన స్థలం లో మృతుని గుర్తించుటకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతుని శవం సగం కుళ్లిపోయింది, ఈ వ్యక్తి ని ఎవరైనా గుర్తు పట్టినచో వెంటనే 8712658591 నంబర్ సమాచారం అందించాలన్నారు.