
చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మండలం లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 25 వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి సుమారుగా 65 నుండి 70 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి సుంకిశాల సమీపంలో యాచకునిగా. అడుక్కొని జీవిస్తుండేవాడు. అతనికి దాహం వేయడంతో ఆ గ్రామ సమీపంలోని మెగా గ్యాస్ కంపెనీ పక్కన ఉన్న పొలాల వద్ద పొలానికి మందుకొట్టి పడవేసిన మందు డబ్బాలో మంచి నీళ్లు పట్టుకొని తాగి అస్వస్థతకు గురయ్యాడు. అది గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం అతడిని రామన్నపేట ఏరియా హాస్పిటల్ కి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం అతనిని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య అందిస్తుండగా ఆ వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినాడు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు.