గుర్తుతెలియని మహిళ మృతి ..

Unknown woman died..నవతెలంగాణ –  కామారెడ్డి 
కామారెడ్డి పట్టణంలో రైల్వే స్టేషన్ ఎదురుగా గల ఇందిరా చౌక్ వద్ద, ఒక గుర్తుతెలియని ఆడ మనిషి, వయసు సుమారు 50-55 మధ్యగల ఆమె, గత కొన్ని రోజుల నుండి ఇక్కడే ఉంటూ, భిక్షాటన చేస్తూ నివసించేది. నిన్న సాయంత్రం 4గం.ల సమయంలో ఇంద్ర చౌక్ గద్దె పైన పడుకొని, పడుకున్న ప్రదేశంలోనే చనిపోయినట్లుగా తమకు సమాచారం వచ్చిందని పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆ సమాచారం అందుకున్న వెంటనే ఆమె యొక్క మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తరలించడం జరిగిందని అన్నారు. ఈమె పింకు రంగు గల జాకెట్ ను, ఆకుపచ్చ రంగు గల చీరను ధరించి ఉంది. చుట్టుపక్కల విచారణ చేయగా గత కొన్ని  సంవత్సరాల నుండి ఇక్కడే రైల్వే స్టేషన్, పరిసర ప్రాంతాలలో తిరుగుతూ, భిక్షాటన చేస్తూ ఉండేదని తెలిసింది. ఈమె ఆచూకీ తెలిసిన ఎవరైనా కూడా కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్  ఎస్ఐ కామారెడ్డి టౌన్ 8712686145, 8712666242 నెంబర్లకు సమాచారం అందించాలన్నారు.