
– ఘనంగా సన్మానించిన కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది
నవతెలంగాణ – పెద్దవూర
పెదవూర ఎంపీడిఓ వర్కాల మోహన్ రెడ్డి, నిర్మల దంపతులకు శనివారం నిడమానూరు మండలం కోటమైసమ్మ గుడి సుమంగళి ఫంక్షన్ హాల్లో జరిగిన పదవీ వరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది జూన్ 30 న పదవీ విరమణ పొందుతున్న సందర్బంగా ఎంపీడీఓ మోహనరెడ్డి దంపతులను ఘనంగా సన్మానం చేశారు. ఈసందర్బంగా పంచాయతీ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షులు డాకు నాయక్, ఉపాధ్యక్షులు విజయ కుమార్ ఆధ్వర్యంలో పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాలు, పూలమాలతో సన్మానించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ నిబద్ధత గా నిజాయితీగా పని చేశారని వారి శేష జీవితం సుఖ సంతోశాలతో ఉండాలని ఆకాంక్షంచారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వెంకటేశ్వర్లు, కార్యదర్శులు రవీందర్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, ముంతాజ్, పరమేష్, శ్యామ్ సుందర్ రెడ్డి, నాగిరెడ్డి, అనిల్ కుమార్, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.