
1984-85, 1985-86 వ సంవత్సరం ఇంటర్మీడియట్ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఆదివారం జరిగింది. ఎంపీసీ బైపీసీ, సిఈసీ, హెచ్ ఈ సీ విభాగాలకు చెందిన పలువురు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమ ప్రారంభంలో ఇటీవల కాలంలో చనిపోయిన తమ మిత్రులు అధ్యాపకులు పేర్లు చదువుతూ వారి ఆత్మ శాంతికై రెండు నిమిషాలు మౌనం పాటించారు. సుమారు 35 సంవత్సరాల తర్వాత ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని కుటుంబ సభ్యులను పరిచయం చేసుకుంటూ కళాశాల అనుభవాలను నెమరు వేసుకున్నారు. అప్పుడు బోధించిన అధ్యాపకులైన రామనాథం మల్లికార్జున్, సుధాకర్, జవహర్ లాల్, సురేందర్, వెంకట్ నరసయ్య లను సన్మానించి మేమెంటు జ్ఞాపికలను అందించి, వారి బోధనలు గుర్తు చేసుకున్నారు. అనంతరం అధ్యాపకులు మాట్లాడుతూ కళాశాల అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. విద్యార్థులలో ఒకరైన ఎన్ రాజేశ్వర రావు హైకోర్టు జడ్జిగాను, మరొకరు టి సాయి మనోహర్ కొత్తగూడెం ఓ ఎస్ డి గా పోలీస్ డిపార్ట్మెంట్లో , ఏ చంద్రమౌళి పక్క రాష్ట్రంలో ఇంగ్లీష్ లెక్చరర్ గా విధులు నిర్వర్తిస్తున్న వారిని కూడా అటు అధ్యాపకులు ఇటు తోటి విద్యార్థులు సన్మానించి తాము గర్విస్తున్నామని తెలిపారు. అనంతరం హైకోర్టు జడ్జిగా విధులు నిర్వహిస్తున్న రాజేశ్వరరావు మాట్లాడుతూ ఇంతకాలం తర్వాత ఒకరినొకరు కలుసుకోవడం సంతోషంగా ఉందని భవిష్యత్తులో ప్రతి సంవత్సరం ఈ విధంగా కలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని సఫలం కావాలని సూచించారు.చంద్రమౌళి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్థాయిలో స్థిరపడిపోవడం సంతోషమని వెనుకబడిన వారిని గుర్తించి స్నేహబరంగా వరకు ఒకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ప్రతి సంవత్సరం ఈ విధానాన్ని కొనసాగించాలని అన్నారు. అనంతరం అప్పటి విద్యార్థుల అందరికీ జ్ఞాపకాలను బహుకరించారు.