నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం తాడు బిలోలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2008 – 2009 లో చదివిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు అపూర్వ సమ్మేళనం నిర్వహించి తమ పాఠశాలలో జరిగిన విషయాలను నెమరువేసుకుంటూ ప్రస్తుతం వారు తమ విశేషాలను తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. తమకు బోధించిన అధ్యాపకులను రప్పించుకొని సన్మానించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని వారు తెలిపారు. 15 సంవత్సరాల కిందట వారు కలిసి చదువుకోగా, నేను అందరూ ఒకే వేదిక మీద కలవడం ఆనందంగా ఉందని వారు తెలిపారు.