పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

An unprecedented reunion of alumniనవతెలంగాణ – పెద్దవంగర

మండలంలోని చిట్యాల జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 2007-08 లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకచోట చేరి గత అనుభవాలను నెమరు వేసుకున్నారు. 16 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. వారు ప్రస్తుత జీవన స్థితిగతులు పంచుకుని, రోజంతా ఆనందంగా గడిపారు. అనంతరం ఆనాటి ఉపాధ్యాయులు సంపత్ కుమార్ బ్రహ్మానంద రెడ్డి పరిపూర్ణ చారి కుమారస్వామి ఉపేంద్ర రమేష్ లతో పాటుగా, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ ను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు సన్మానించారు. అనంతరం ఆనాటి ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మహేష్, అశోక్, నాగరాజు, మహేందర్, ప్రశాంత్, జైపాల్, శంకర్, బాలరాజు, ఉపేందర్, సంపత్, శోభన్ బాబు, సంధ్య, స్వప్న, అనిత, కల్పన, నీరజ, రాణి తదితరులు పాల్గొన్నారు.