పుంజుకోని ఆయిల్ ఫాం గెలలు ధర…

– గత నెల కంటే టన్నుకు రూ.258 పెరుగుదల…

– నవంబర్ లో టన్ను గెలలు ధర రూ.12,454 లు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్ ఫాం గెలలు ధర ఈ ఏడాది చివరి నెలలోను పుంజుకోలేక పోయింది.అయినా గత నెల అక్టోబర్ నెల కంటే టన్నుకు రూ.258 పెరుగుదల కన్పిస్తుంది.
నవంబర్ నెలకు టన్ను గెలలు ధర రూ.12,454 లు గా నిర్ణయించినట్లు ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ టి.సుధాకర్ రెడ్డి తెలిపారు. గత ఏడాది కాస్త మెరుగైన ధరలు పొందినప్పటికీ ఈ ఏడాది ఏ నెల లోనూ టన్ను గెలలు ధర రూ.14 వేలకు మించి రాలేదు.దీంతో రైతులు నైరాశ్యంలో ఉన్నారు.