అకాల వర్షంతో ఆగమవుతున్న అన్నదాత..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

ఆ కాలంగా వర్షాలు కురవడంతో నాగిరెడ్డిపేట మండలంలోని పలు గ్రామాలలో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. వరి పంటను కోసి కొనుగోలు కేంద్రాలకు తరలించి అక్కడ ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆగమవుతున్నారు. శనివారం ఉదయం నుండి ఈదురు గాలులు వర్షపు చినుకులు పడడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన వారి ధాన్యం పై టాపర్లు కప్పి అన్నదాతలు తమ ధాన్యాన్ని కాపాడుకుంటున్నారు. అకాలంగా వర్షం చినుకులు రావడంతో కూతకు వచ్చిన వరి ధాన్యాన్ని కూడా కోయకుండా అన్నదాతలు నిలిపివేస్తున్నారు. ప్రభుత్వం త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేసి తమని ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.