
నల్గొండ జిల్లా అనుమల మండలం కొత్తపల్లి గ్రామంలో కట్ల సాయి అనే అనాధ వ్యక్తికి కంటి చూపు, కాళ్లు పక్షవాతం రావడంతో అది తెలుసుకున్న దాతృత ఫౌండేషన్ సభ్యులు రూ.5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాతృత ఫౌండేషన్ నల్గొండ ప్రెసిడెంట్ కాంసాని వెంకట్ రెడ్డి,చలమల్ల వెంకటరెడ్డి, పాతనబోయిన సురేష్, అలుగుల కృష్ణారెడ్డి, మారుపాక మల్లికార్జున గౌడ్, అయితగోని సతీష్, అనుముల ప్రశాంత్, సుబ్బు, సైదులు, అనిల్, రాకేష్, అశోక్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.