గోషామహల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆనంద్‌ గౌడ్‌..?

– ఖరారు చేసిన సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌ పార్లమెంటు పరిధిలోని గోషా మహల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మునుకుంటల్ల ఆనంద్‌ గౌడ్‌ బరిలోకి దిగనున్నారు. సీఎం కేసీఆర్‌ ఆయన పేరును దాదాపు ఖరారు చేసినట్టు తెలిసింది. త్వరలో ప్రకటించబోయే రెండో జాబితాలో ఆనంద్‌ గౌడ్‌ పేరు ఉండబోతోందని సమాచారం. రద్దయిన మహారాజ్‌గంజ్‌ నియోజకవర్గంతోపాటు ఇప్పటి నాంపల్లి, గోషామహల్‌ నియోకవర్గాల్లో ఆనంద్‌కు గట్టి పట్టుందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో గత 22 ఏండ్ల నుంచి ఆయన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల్లో మంచి పేరును సంపా దించుకున్నారని తెలిపాయి. ఈ క్రమంలోనే ఆయన పేరును సీఎం ఖరారు చేసినట్టు పాతబస్తీకి చెందిన ఓ సీనియర్‌ నాయకుడు తెలిపారు.