విజయానికి ప్రతీకగా చెప్పుకునే ఆనంద రవళి. దీపావళి పండుగ మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం కుల, మత, జాతి, విభేదాలు విస్మరించి అందరూ సమైక్యంగా ప్రజలు ఘనంగా నిర్వహించారు.అయితే కొత్తగా పెళ్లిళ్లు అయిన అల్లుళ్ళను అత్తగారింటికి ఆహ్వానించి పలువురు నోములు నోముకున్నారు. దీపావళి పండుగ పురస్కరించుకుని చిన్న పెద్దలు కొత్తబట్టలు వేసుకొని,పిండివంటలు చేసుకొని, తపకాయలు కాలుస్తూ సంబరాలు అంబన్నంటాయి.బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసిన వారికి అమ్మకాలు జోరుగా నడిచాయి.ఇళ్ల ఎదుట ప్రవీదులతో వెలుగులు విరజిమ్మాయి.దీపావళి సందర్భంగా మార్కెట్ లో సందడి నెలకొంది.