అనంతుల కరుణాకర్‌ రెడ్డి సేవలు శ్లాఘనీయం

– పారిశ్రామిక వేత్తలు
– పంచశీల కాలనీ ఇండిస్టియల్‌ వెల్ఫేర్‌
అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కరుణాకర్‌రెడ్డి సంతాప సభ
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట.
ప్రముఖ పారిశ్రామికవేత్త, యాంకర్‌ పరిశ్రమల అధినేత, శ్రీ లలితా పరమేశ్వరి దేవాలయ చైర్మెన్‌ అనంతుల కరుణాకర్‌ రెడ్డి సేవలు శ్లాఘనీయమని పలువురు పారిశ్రామికవేత్తలు అన్నారు. మంగళవారం సాయంత్రం రంగారెడ్డి నగర్‌ డివిజన్‌ పరిధి పంచశీల కాలనీలోని యాంకర్‌ ఇంజనీరింగ్‌ ప్రయివేటు లిమిటెడ్‌ పరిశ్రమ ప్రాంగణంలో పంచశీల కాలనీ ఇండిస్టియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వ ర్యంలో అనంతుల కరుణాకర్‌రెడ్డి సంతాప సభ ఏర్పాటు చేశారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో పాటు కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు, ఆయన చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ,శ్రీ లలితా పరమేశ్వరి దేవాలయ కమిటీ అధ్యక్షులు లయన్‌ .డాక్టర్‌ చిల్లా రాజశేఖర్‌ రెడ్డి సభా ధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లా డుతూ గత రెండున్నర దశాబ్దాలుగా ఈ ప్రాంత పరిశ్రమల, కార్మికుల మనుగడ కోసం కరుణాకర్‌రెడ్డి ఎంతో కృషి చేశారని, దేవాలయం అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుప డేవారని గుర్తు చేసుకుంటూ ఆయన సేవలను కొనియా డారు. అందరితో కలుపుగోలుగా ఉండే కరుణాకర్‌ రెడ్డి తమ మధ్య లేకపోవడం తీరనిలోటని, జీర్ణించుకోలేకపోతు న్నామన్నారు. ఈ సందర్భంగా కరుణాకర్‌రెడ్డి భార్య అనం తుల రజిత, కుమార్తెలు చరిత, నిఖిత, అల్లుడు స్వరూప్‌ రెడ్డిలు మాట్లాడుతూ కరుణాకర్‌రెడ్డి ఆశయ సాధనకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రామిక వేత్తలు (వి.వి.ఈ. ట్రాన్స్‌ఫార్మర్‌ అధినేత) యువ పారిశ్రామికవేత్త, ఐ.వినోద్‌, జి. కిషోర్‌ బాబు, వాసం బాలరాజు, నాగరాజు గౌడ్‌, పంచశీల కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గోపాల్‌ రెడ్డి, మాజీ అధ్యక్షులు పి.సతీష్‌ రెడ్డి, కేఎల్‌.రమణారెడ్డి, లయన్‌. విష్ణువర్ధన్‌ రెడ్డి, లయన్‌. వెంకటేశ్వర్‌ రెడ్డి, రామిని శ్రీనివాస్‌, రాజిరెడ్డి, వెంకట్‌ రెడ్డి, పరిశ్రమ కార్మికులు,సన్నిహితులు పాల్గొని నివాళులు అర్పించారు.