సహాచట్టం గ్రామ కన్వీనర్ గా అనపర్తి రాజేష్

నవతెలంగాణ – మల్హర్ రావు
యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ ఆదేశాల మేరకు కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రామ అనపర్తి రాజేష్ ను శనివారం నియామకం చేసినట్లుగా కాటారం డివిజన్ యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ తెలిపారు.నూతనంగా ఎన్నికైన రాజేష్ ఈ సందర్భంగా  మాట్లాడారు,గ్రామ స్థాయిలో అవినీతి అక్రమాలకు తావు లేకుండా అడ్డుకట్ట వేసేందుకు లంచగొండి అధికారులకు, ప్రశ్నించే,గొంతుకనై,పనిచేస్తానని,సమాచార హక్కు చట్టం ప్రజల చేతులు, వజ్రాయుధంగా పనిచేస్తుందన్నారు. తనపై నమ్మకంతో ఎన్నిక చేసిన కాటారం డివిజన్ కన్వీనర్ కుమార్ యాదవ్,జిల్లా కమిటీకి ప్రత్యేక  కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్హర్ మండల కార్యదర్శి బండి సుధాకర్ పాల్గొన్నారు.