– యువతీ మహిళ వస్త్ర ప్రపంచం షాపింగ్ మాల్ ప్రారంభం
నవతెలంగాణ-కోదాడరూరల్
పట్టణంలో సోమవారం సినీనటి అనసూయ సందడి చేశారు. పట్టణంలో ప్రధాన రహదారిపై ఉన్న యువతి మహిళా వస్త్ర ప్రపంచం షాపింగ్‌మాల్‌ను జ్యోతి వెలిగించి ఆమె ప్రారంభించారు. షాపింగ్‌మాల్‌పై అంతస్తులో ఉన్న సరికొత్త వస్త్రాలను ఆసక్తిగా తిలకించారు. నాణ్యమైన వస్త్రాలు అందించి వినియోగదారుల మన్ననలు పొందాలని నిర్వాహకులకు సూచించారు.కాగా భారీగా తరలివచ్చిన అభిమానులు కోరిక మేరకు పాటలకు స్టెప్పులేసి యువతలో జోష్ నింపారు.ఈ సందర్భంగా ఆమెతో సెల్ఫీలు దిగేందుకు యువకులు పెద్దఎత్తున ఆసక్తి చూపారు.అంతకుముందు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ రిబ్బన్ కట్ చేసి షాపింగ్‌మాల్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత, నమ్మకమైన వస్త్రాలను అందించి మహిళల మన్ననలు పొందాలన్నారు.నిర్వాహకులు మాట్లాడుతూ కోదాడ ప్రాంతం నుండి హైదరాబాద్, విజయవాడ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళనవసరం లేకుండా పట్టణంలోనే మగువల మనసు దోచే యువతి మహిళా వస్త్ర ప్రపంచం షాపింగ్ మాల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.ప్రారంభోత్సవం సందర్భంగా అందిస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో షాపింగ్‌మాల్ నిర్వాహకులు కొప్పు రామారావు, తాటికొండ బద్రీనాథ్, అమర్‌నాధ్,బండ్ల రాధాకష్ణ, మున్సిపల్ చైర్‌పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ, ఎంపీపీ చింత కవితరాధారెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు తుమ్మలపల్లి అజంతాభాస్కర్,పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు, వెంపటి మధుసూదన్, స్థానిక కౌన్సిలర్ కోళ్ల కోటిరెడ్డి,కనగాల నాగేశ్వరరావు, మదీనా మీరా తదితరులు పాల్గొన్నారు.