– 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కొత్త చరిత్ర
పారిస్ :77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కొత్త చరిత్ర నమోదైంది. ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ నటిగా అనసూయ సేన్‌గుప్తా నిలిచారు. అన్ సెర్టైన్ రిగార్డ్ విభాగంలో ఆమె ఈ అవార్డును గెలుచుకున్నారు. బల్గేరియన్ దర్శకుడు కాన్‌స్టాంటిన్ బోచనోవ్ దర్శకత్వం వహించిన భారతీయ చిత్రం ‘ది షేమ్‌లెస్’లో ఆమె నటనకు ఈ అవార్డు లభించింది. ఈ చిత్రాన్ని ఢిల్లీ వ్యభిచార గహంలో సెక్స్ వర్కర్ కథగా చిత్రీకరించారు. ప్రపంచవ్యాప్తంగా తమ హక్కుల కోసం ధైర్యంగా పోరాడినందుకు ఈ అవార్డును ”క్వీర్ కమ్యూనిటీ, ఇతర అట్టడుగు వర్గాలకు” అంకితం ఇస్తున్నట్లు కోల్‌కతాకు చెందిన అనసూయ సేన్‌గుప్తా తెలిపారు. శనివారంతో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగిశాయి.