ఇంకా నరబలి?

ఇంకా నరబలి?బడి బాగు కోసం
బాలుని నరబలి
ఇదేమి చదువు?
ఇదేమి జ్ఞానం?
ఇదేమి పాలన?
ప్రధాని మోడీ స్పందించడా?
సి.ఎం. యోగి సమాధాన మివ్వడా?
హత్రాస్‌ ఎప్పుడూ
అకృత్యాల అడ్డాగా
మిగిలి పోవడమేనా?
నరబలుల దేశంగా
నవభారత్‌…?
అయ్యో! అయ్యో! అయ్యో!
ఎంతగా గుండెలు బాదుకున్నా
బాలుడు తిరిగిరాడు.
మూర్ఖత్వం మళ్లీ మళ్లీ
పురుడు పోసుకుంటున్నదే…
పాలకులరా……
కండ్లప్పగించి చోద్యం చూస్తూ….
జీవశ్చవాల్లా మిగిలిపోండి.
లేదా శవాలను పీక్కుతినే
రాబందుల్లా మారిపోండి.
ఆగ్రహం
బలిచ్చిన వారిపై కాదు
మూర్ఖత్వాన్ని చోద్యంగా చూస్తున్న
పాలకులపైనే…
స్పందించని
అమానవీయ ఉదాశీనతపైనే

మనమధ్యనే
బలులు కోరుకునే
మానవ మృగాలు
తిరుగుతున్నాయి.
నిద్ర నుండి మేల్కోకపోతే
నిద్రలోనే చంపేస్తారు.
– కె. శాంతారావు,
9959745723
(28/9/24 హత్రాస్‌లో పదకోండేండ్ల బాలుడి నరబలి వార్త చదివి)