– ఆదర్శ పాఠశాలలో మారని విద్యాశాఖ బోర్డ్
– పేరు మార్పు చేయడంలో బహిర్గతమైన సిబ్బంది నిర్లక్ష్యం
నవతెలంగాణ – బెజ్జంకి
ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు జరిగి సుమారు రెండు నెలలు గడుస్తున్నా ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ నే యథావిధిగా కొనసాగిస్తుండడం విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా బహిర్గమవుతోంది. క్రమశిక్షణకు మారుపేరుగా పేరుగడించిన ఆదర్శ విద్యాలయ సిబ్బంది నిర్లక్ష్యం మండలంలో పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మండల కేంద్రానికి అనుబంధ గ్రామమైన ఎల్లంపల్లి ఆదర్శ విద్యాలయంలో విద్యాశాఖ బోర్డ్ పై ముఖ్యమంత్రిగా కేసీఆర్,విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి పేర్లను మార్పు చేయకుండా యథావిధిగా కొనసాగిస్తుండడం సిబ్బంది నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తోంది.ఆదర్శ విద్యాలయ సిబ్బంది ఇప్పటికైన నిర్లక్ష్యం వీడి విద్యాశాఖ బోర్డ్ పై పేర్లను మార్పు చేస్తారా లేకా యథావిధిగా కొనసాగిస్తారా వేచి చూడాల్సిందే.