రఫెల్ నాదల్
మాడ్రిడ్: ఇక అల్కరాజ్ శకం మొదలైందని స్పెయిన్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ అన్నాడు. ఆదివారం జరిగిన వింబల్డున్ ఫైనల్లో అల్కరాజ్ తొలి సెట్ 6-1తో చిత్తుగా ఓడితే మళ్లీ పుంజుకోవడం కష్టమే అనుకున్నానని, ఆ తర్వాత సెట్‌ను టైబ్రేక్‌లో గెలుచుకున్నా.. ట్రోఫీ దక్కదేమోనని భయపడ్డానని తెలిపాడు. కానీ అతడు ఫైనల్లో గెలిచిన తీరు వర్ణణాతీతమని పేర్కొన్నాడు. రాబోయేది అల్కరాజ్ శకమేనని ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. ”కంగ్రాట్యులేషన్స్ అల్కరాజ్. ఈరోజు మాకు నువ్వు ఎనలేని సంతోషాన్ని పంచావు. స్పానిష్ టెన్నిస్‌లో మన మార్గదర్శి, దిక్సూచి, వింబుల్డన్‌లో అద్భుతాలు చేసిన మనోలో సాంటానా కూడా నీ ఆట చూసి ఉప్పొంగిపోయి ఉంటారు. నిన్ను గట్టిగా హత్తుకుని ఈ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలని ఉంది చాంపియన్!!! మన టీమ్‌కు ఇదొక గొప్ప క్షణం” అని నాదల్.. అల్క్‌రాజ్‌ను ఉద్దేశించి భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. తొంటినొప్పి కారణంగా రఫెల్ నాదల్ వింబుల్డన్ చాంపియన్‌షిప్‌కు దూరమయ్యాడు. ఇదిలా ఉంటే.. అల్కరాజ్ అద్భుత ఆటతో 24వ గ్రాండ్‌స్లామ్ గెలవాలన్న జొకోవిచ్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అలాగే అత్యధిక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఫెదరర్(8) రికార్డును సమం చేయకుండా అడ్డుకున్నాడన్నాడు.
ఫెదరర్‌తో పోల్చిన సచిన్
అల్కరాస్‌ను భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన రోజర్ ఫెదరర్‌తో పోల్చాడు. ఫైనల్ పోరు చూసిన అనంతరం ట్విటర్‌లో అతడిపై ప్రశంసలు కురిపించాడు. ”ఎంతో అద్భుతమైన ఫైనల్ పోరు ఇది. ఈ ఇద్దరు ఆటగాళ్లు గొప్పగా ఆడారు. టెన్నిస్‌లో తర్వాతి సూపర్‌స్టార్ ఎదుగు దలను మనం చూస్తున్నాం. ఫెదరర్ కెరీర్‌ను అనుసరించినట్లే మరో 10-12ఏళ్లు.. కార్లోస్ కెరీర్‌ను నేను ఫాలో అవుతాను. అతడికి నా అభి నందనలు” అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. 20ఏళ్ల కార్లోస్ అల్కరాస్.. 2018నుంచి వింబుల్డన్‌లో ఓటమే లేని జకోవిచ్‌కు పరాజ యాన్ని రుచి చూపాడు. దీంతో భవిష్యత్‌లో అగ్రశ్రేణి ఆటగాడిగా ఎదుగుతాడంటూ కితాబిచ్చాడు. గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో అగ్రస్థానంలో ఉంది. రేపు(బుధవారం) పాకిస్తాన్-ఏ – ఇండియా -ఏ జట్ల మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ జరగనుంది.