పేద విద్యార్థులకు అండ బుసిరెడ్డి పౌండేషన్..!

నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, హిల్ కాలనీలోని ఉదయ్ చారిటబుల్ ట్రస్ట్ విధ్యార్థులకు శనివారం బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్, శ్రీ వైష్ణవి కన్ స్ట్రషన్స్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ఉదయ్ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ తన్నీరు సతీష్  ఆహ్వానం మేరకు ఉదయ్ చారిటబుల్ ట్రస్ట్కి ఐదుగురు విధ్యార్థులకు సైకిల్స్ పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు.ఈసందర్బంగా ఛైర్మెన్ మాట్లాడుతూ ప్రతిరోజు 5కి.మి కాలినడకన విద్యార్థులు  ప్రయాణ చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని  సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగిందని, అన్నారు. నిరుపేద విద్యార్థులు బుసిరెడ్డి పౌండేషన్ ఎల్లపుడు అండగా వుంటుందని అన్నారు. అనంతరం భాగంగా గౌరవ బుసిరెడ్డి ఛైర్మెన్ పాండురంగారెడ్డిని విధ్యార్థులు, సంస్థ చైర్మన్, వైస్ చైర్మన్లు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ ఉదయ శ్రీ,తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, నెల్లికల్లు మాజీ సర్పంచ్ జనార్ధన్ రెడ్డి, మాజీ యంపిపి, తిరుమలనాధ గుడి చైర్మన్ బుర్రి రామిరెడ్డి, వార్డు కౌన్సిలర్లు ఈర్ల రామకృష్ణ, విక్రమ్, మాజీ కోఆపరేషన్ నాదెండ్ల కృష్ణారెడ్డి, సాగర్ రెడ్డి, వంగాల భాస్కర్ రెడ్డి, అనుముల కోటేష్, అబ్దుల్ కరీం, గజ్జల నాగార్జున రెడ్డి, గజ్జల శివానంద రెడ్డి, జయంత్ రెడ్డి, నితిన్,సేవల్ నాయక్ మరియు తదితరులు పాల్గొన్నారు.