నిరుపేదలకు అండ ఆత్మబంధు


– సాగర్-మెరుగైన సాగర్ అంటున్న మన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్
– నిరంతరం మీ సేవకై ఎల్లప్పుడూ పరితపిస్తా..
నవతెలంగాణ పెద్దవూర: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పలు మండలాల పరిధిలో గల వివిధ గ్రామాల్లో పెద్ద పేరుమయ్య అనుముల మండలం, మారేపల్లి గ్రామం, కొంగోలి రాంప్రసాద్  నిడమానూరు మండలం, వెంగన్నగూడెం, ధనావత్ మోతి త్రిపురారం మండలం మేట్య తండా మృతి చెందారని తెలియగానే వారి కుటుంబాలకి అండగా బుసిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మబంధు కార్యక్రమంలో భాగంగా ఒక్కోక్క కుటుంబానికి 100 భోజనాలు చొప్పున పంపించడం జరిగింది. ఆర్ధికంగా ఇబ్బందివున్న నిరుపేద కుటుంబాలకి మన ఆత్మబంధు ఎల్లప్పుడు అండగా ఉంటుందని, సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 9581742356 కు సంప్రదించవలసినదిగా కోరారు. నలుగురిని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో ఈ ఆత్మబంధు కార్యక్రమం చేపట్టడం జరిగిందని పాండు రంగారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.