అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన యాసరేని రాములు సంతాప సభ మిరుదొడ్డి మండలం అందే ప్రాథమిక పాఠశాలలో మంగళవారం జరిగింది. పాఠశాలలో పనిచేస్తున్న రాములు అకాల మృతి చెందడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్ రెడ్డి అధ్యక్షతన సంతపసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ ప్రభుదాస్, మండల నోడల్ అధికారి ప్రవీణ్ బాబు ,స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు మాట్లాడారు. రాములు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణ , రాజేశ్వర్ స్రవంతి, సురేఖ స్థానిక వైద్య సిబ్బంది అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు,గ్రామస్తులు ప్రవీణ్ , యాదగిరి, మహర్షి,లక్ష్మీనారాయణ , చుక్క శంకర్, కుమార్, సత్యం విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.