ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌కు మాతృవియోగం

–  మాజీ సీఎం కేసీఆర్‌ సంతాపం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌ మాతృమూర్తి కండ్లకుంట రంగనాయకమ్మ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన కుటుంబానికి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి,బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంతాపాన్ని తెలిపారు. శ్రీనివాస్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సీపీఐ సంతాపం
ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్‌ మాతృమూర్తి కండ్లకుంట రంగనాయకమ్మ మరణం పట్ల సీపీఐ రాష్ట్ర సమితి సంతాపం ప్రకటించింది. ఆమె కుటుంబ సభ్యులకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రగాఢ సానుభూతిని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.