బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జిగా ఆందోజు శంకరాచారి

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
బహుజన్ సమాజ్ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జిగా  రెండోసారి ఆందోజు శంకరాచారిని ఆదివారం రాత్రి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నియమించారు. యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం  ఆందోజు శంకరాచారి సొంత గ్రామం.2022 మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసి దేశవ్యాప్తంగా అప్పట్లో పేరు మారు మోగింది.బహుజన వాదాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి బహుజన్ సమాజ్ పార్టీని బలోపేతం చేయడమే ద్వేయంగా పని చేస్తానని ఆందోజు శంకరాచారి తెలిపారు.బీఎస్పీ అధినేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అప్పజెప్పిన ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తానని అన్నారు.