
చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయం హుండి లెక్కింపు గురువారం పర్యవేక్షణ అధికారి ఎస్.మోహన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. దేవస్థాన హుండీలను విప్పి లెక్కించగా 4 నెలల 20 రోజులకు గాను రూ.14,96,475 ఆదాయం రావడం జరిగిందనీ మోహన్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ పర్యవేక్షకులు కే. ఏడుకొండలు రికార్డ్ అసిస్టెంట్ సత్తిరెడ్డి అర్చకులు శివప్రసాద్ శర్మ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.