రేపు ఆందోల్ మైసమ్మ దేవాలయం హుండీ లెక్కింపు

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలోని శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయం తేది:6.2.2024 మంగళవారం రోజున ఉదయం 10:00 గంటలకు దేవాలయం ఆవరణలో హుండీ లెక్కింపు ఉంటుందని ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి ఎస్. మోహన్ బాబు ఆదివారం తెలిపారు. హుండీలు విప్పి లెక్కింపు కార్యక్రమానికి మండలంలోని వివిధ కార్యాలయాలకు పర్యవేక్షణ అధికారులకు సమాచారం పంపించడం జరిగిందని,సకాలంలో పర్యవేక్షణ అధికారులు హాజరు కాగలరని ఈవో ఎస్.మోహన్ బాబు తెలిపారు.