ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తిర్మన్ పల్లి గ్రామంలోని తెలంగాణ గిరిజన బాలికల పాఠశాల, కళాశాలలో కౌమార దశ బాలికలకు రక్తహీనతపై అవగాహన కార్యక్రమం మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ అద్వర్యంలో నిర్వహించారు. “ఎనీమియా ముక్త్ భారత్” అనే కార్యక్రమం లో బాగంగా తెలంగాణ గిరిజన బాలికల పాఠశాల, కళాశాలలో 220 మంది పిల్లలకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు కౌమారదశ బాలికలకు రక్తంలో హిమోగ్లోబిన్ 12 గ్రాములు ఉండాలని, అంతకన్నా తక్కువగా ఉన్నట్లయితే ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలు వారానికి ఒకసారి ఇవ్వాలని,అలాగే 11 గ్రాములు హిమోగ్లోబిన్ ఉన్న పిల్లలకు ప్రతిరోజు ఒక ఐరన్ పోలిక ఆసిడ్ మాత్రమే ఇవ్వాలని,మోడరేట్ అనగా 10 గ్రాములు హిమోగ్లోబిన్ గల పిల్లలకు ప్రతిరోజు రెండు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. రక్తహీనత గల 8 గ్రాముల కంటే తక్కువ హిమోగ్లోబిన్ గల పిల్లలకు మూడు నెలలు ప్రతిరోజు రెండు ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వాలని తెలిపారు. కౌమార దశ బాలికలు తీసుకునే ఆహారంలో పూర్తిస్థాయిలో తాజా ఆకుకూరలు, బీట్రూట్ ,పాలు,బెల్లం, పల్లీలు అధికంగా తీసుకోవాలని సూచించారు.వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ఆహారం తీసుకునే ముందు మరుగుదొడ్డి వాడిన తర్వాత చేతులు శుభ్రంగా కడుకోవాలని, చేతులు కడిగే విధానాన్ని వివరించారు. చేతులను శుభ్రంగా కడుక్కోనట్లైయితే నులిపురుగులు కడుపులోకి వెళ్లి రక్తహీనత కలిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పోషకాహార లోపం ఏర్పడి రక్తహీనతకు గురి అవుతారని తెలిపారు. పిల్లలకు మొదట ఆల్బండాజోలు మాత్రలు వేసి ఆ తర్వాత ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలు వేయాలని స్థానిక స్టాఫ్ నర్స్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్ అలీ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ, ఆరోగ్య సిబ్బంది శారద ,ఆర్. బి.ఎస్.కే సిబ్బంది, ఫార్మసిస్ట్ మౌనిక,సుమలత, స్టాఫ్ నర్స్ స్రవంతి ఆశా కార్యకర్త బండ ప్రమీల పాల్గొన్నారు.