నవతెలంగాణ-కంటేశ్వర్ : విద్యార్థుల్లో రక్తహీనత నిర్మూలించేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం రోజు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ధర్మారం (బి ) ఎం జె పి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించారు.కేంద్ర ప్రభుత్వం 2020లో చేపట్టిన ‘ఎనిమియా ముక్త్ భారత్’ ద్వారా నిర్వ హించిన రక్త పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 5,622 మందిలో హిమోగ్లోబిన్ 9 గ్రాముల కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని జనవరి 24 నుంచి ప్రారంభించారు. అప్పట్లో కరోనా రావడంతో పరీక్షలు నిలిపివేశారు.ఒక్క ఆర్బీఎస్కే బృందం 35 రోజుల పాటు రక్త పరీక్షలు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.రోజు 100 మందికి పరీక్షలు చేస్తున్నామని వైద్యులు చెప్పారు.జిల్లాలో ఆర్బీఎస్కే వైద్య బృందాలు మొత్తం 15 ఉన్నాట్లు, నిజామాబాద్ జిల్లాకు 15 రక్తపరీక్ష కిట్లు, 49 వేల స్టిఫ్స్ ఇచ్చారు. 8,9,10, ఇంటర్ విద్యార్థులకు రోజు 100 పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లుచేశామన్నారు. ఆవసరమైన వారికి నెలనెలా ఐరన్ మాత్రలను పంపిణీ చేయనున్నమ్మన్నారు. పౌష్టికాహారం తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.ఈ సందర్బంగా పాఠశాల, కళాశాలల్లో దోమల నివారణకై స్ప్రే మందు కొట్టారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇస్తియానాథ్ అలీ (వైద్య అధికారి). ఎం డి,డాక్టర్ సబా ఫర్హీన్ (వైద్య అధికారి). ఎం ఒ, ఫార్మసిస్ట్ కే. దీప,విజయ రాణి ఏ ఎన్ ఎం,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మానస, సావిత్రి ఏ ఎన్ ఎం, .ఆశావర్కర్ పి.భువనేశ్వరి.హెల్త్ సూపర్ వైజర్ మల్లెపూల మౌనిక, జె.సిద్ధార్థ జూనియర్ అసిస్టెంట్, జె.పవన్.బిల్ కలెక్టర్,జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.