అంగన్ వాడీల సమ్మె నోటీస్ 

– భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు 
నవతెలంగాణ – నసురుల్లా బాద్ 
కార్మికుల సమస్యలను పరిష్కారం కొరకు  2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్ లో అంగన్ వాడీ టీచర్స్, హెల్పర్స్ అందరూ పాల్గొంటారని తెలియజేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం బాన్సువాడ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ వాణి కి సమ్మె నోటీసు అందించారు. సీఐటీయూ నాయకులు సురేష్, కలిల్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మె చేస్తున్నామన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు గడిసిపోతున్న కార్మిక సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందిందని ఆయన ఆరోపించారు. పని భారం పెంచినప్పటికీ పనికి తగ్గ వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగు కార్మిక చట్టాలను వెంటనే రద్దుచేసి కార్మికులకు 8 గంటల పని దినం లను అమలు జరిగేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తి అయినా, కార్మిక వర్గాల సమస్యలను పరిష్కరించలేదని, పని భారం పెంచి పనికి తగ్గట్టు వేతనం ఇవ్వకపోగా, నూతన విద్యా విధానంతో పాటు కార్మికుల హక్కులు హరించే విధంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, లేబర్ కోడ్లను రద్దుచేసి ఎనిమిది గంటల పని దినములను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్ వాడి సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26 వేల వేతనం ఇవ్వాలని. పిఎఫ్. ఈఎస్ఐ. సౌకర్యంతో పాటు పెండింగ్ లో ఉన్న. టిఏ, డిఏ లను. గృహ బిల్లు. గ్యాస్ బిల్లలు. డిసెంబర్ నెల జనవరి నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలన్నారు. ఈ కార్య్రమంలో ఆంగన్ వాడి యూనియన్ నాయకులు. మహాదేవి. రేణుక. ఇందిరా. బాలమణి. అరుణ. తదితరులు పాల్గొన్నారు.