అధికారుల అనుమతి లేకుండానే అంగన్వాడి బంద్..

Anganwadi bandh without the permission of the authorities.

నవతెలంగాణ – కొనరావుపేట

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కేంద్రంలోని  అంగన్వాడీ కేంద్రాము 4  సెంటర్లలో విధులు నిర్వర్తిస్తున్న టీచర్ విధుల పట్ల అలసత్వం వహిస్తూ, శనివారం రోజున సెంటర్లను తెరువలేదు.స్త్రీ శిశు సంక్షేమ పథకం ద్వారా ప్రతిరోజు గర్భిణీలకు పిల్లలకి అందించవలసిన పౌష్టికాహారాన్ని కూడా పంపిణీ చేయలేదు. అంగన్వాడి కేంద్రాలు మూసి ఉండడంతో వచ్చిన పిల్లలందరూ తిరిగి ఇంటిబాట పట్టారు.మూసి ఉన్న అంగన్వాడి కేంద్రాలను గూర్చి జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజంను వివరణ కోరగా విధుల పట్ల అలసత్వం వహించిన టీచర్లకు మెమొలు జారీ చేసి వారు ఇచ్చిన వివరణ ఆధారంగా శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఏది ఏమైనా అధికారుల నుండి అనుమతి తీసుకోకుండా విధుల పట్ల అలసత్వం వహించిన అంగన్వాడీ టీచర్లపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.