అంగన్వాడి సెంటర్లను బలోపేతం చేయాలి: ఇంచార్జ్ సీడీపీఓ ఆర్ జ్యోతి

Anganwadi centers should be strengthened: In-charge CDPO R Jyotiనవతెలంగాణ  – ఆర్మూర్  

పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తూ అంగన్వాడి సెంటర్లను బలోపేతం చేయాలని ఇన్చార్జ్ సిడిపిఓ ఆర్ జ్యోతి అన్నారు. పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో అంగన్వాడి టీచర్లకు సోమవారం ఈ సి సి ఈ శిక్షణ బ్యాచ్ ముగింపు కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య రంభ దశలో చిన్నారులకు మెదడు అభివృద్ధి అతివేగంగా ఉంటుందని, పిల్లలకు మంచి వాతావరణంలో ఉండి పదేపదే అవకాశాలు కల్పించడం ద్వారా మెదడు అభివృద్ధిలో నాడీ కణాలు వృద్ధి జరుగుతుందని, మూడు నుండి ఆరు సంవత్సరాల దశలో పూర్వ ప్రాథమిక విద్య ప్రాముఖ్యత పిల్లలతో సమగ్ర అభివృద్ధి ప్రభావితం కనపరస్తాయని అన్నారు. జాతీయ విద్యా విధానంలో వచ్చిన మార్పుల ద్వారా పూర్వ ప్రాథమిక విద్యా దీపిక లో మార్పుల గురించి అభివృద్ధి క్షేత్రాలలో లక్ష్యాలను చేరుకొని సమగ్ర అభివృద్ధి సాధించవచ్చని, ఇది 20 30 వరకు చేరుకొని దిశగా పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని అన్నారు. అంగన్వాడి సెంటర్లలో ప్రీ స్కూల్ పిల్లల నమోదు శాతాన్ని పెంచాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్స్ శ్రీదేవి ,రేఖ, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ రాంబాబు, సూపర్వైజర్లు వెంకట రమణమ్మ, మాధవి ,సమత, అనురాధ, నలిని, విలాస్, సాగర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.