నవతెలంగాణ -భీంగల్
అంగన్వాడి ఉద్యోగులను పర్మనెంట్ చేసే కనీస వేతనంగా 26 వేల రూపాయల అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు సోమవారం నుండి చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా పట్టణ కేంద్రంలోని ఐసిడిఎస్ కార్యాలయం ముందు సమ్మెలో కూర్చున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అంగన్వాడి కేంద్రాలలో 48 సంవత్సరాల నుండి ఎంతోమంది అంగన్వాడి కార్యకర్తలు చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రాష్ట్రంలో కూడా 70 వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు పని చేస్తున్నారని కానీ వీరి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు .ఇందులో భాగంగానే సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్నట్లు వారు తెలిపారు .కనుక ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడి కార్యకర్తల సమస్యల పరిష్కారానికి మార్గం చూపాలన్నారు. ఇందుకు ప్రతి కార్యకర్తను పర్మినెంట్ చేసి 26 వేల వేతనంతో పాటు పిఎఫ్ ఉద్యోగ భద్రత లాంటి సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని భీంగల్ పోలీసులకు అందజేశారు. ఈ సమ్మెలో మండల నాయకులు ప్రమీల, లక్ష్మి ,సంధ్య, గంగా లక్ష్మి ,సువర్ణ ,సునీత తో పాటు కార్యకర్తలు ఉన్నారు