అంగన్ వాడి ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

– హాజరైన టీఎన్జీవోఎస్ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ అలుక కిషన్

నవతెలంగాణ –  కంటేశ్వర్

అంగన్వాడి టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఆదర్శ గ్రామమైన శ్రీనగర్ నందు ఏర్పాటు చేసిన అంగన్వాడి ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి టీఎన్జీవోస్ పక్షాన ముఖ్య అతిథిగా హాజరై అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అంగన్వాడి విధుల నిర్వహణలో ఉత్తమ సేవలు నిర్వహించిన అంగన్వాడీ ఉద్యోగులను అభినందించి, అధ్యక్ష ఉపన్యాసంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ మాట్లాడుతూ.. మాత శిశు సంక్షేమ శాఖలో ప్రభుత్వ పథకాలు గ్రామాల్లో ప్రజలకు చేరవేయటలో ప్రముఖ పాత్ర వహిస్తున్న అంగన్వాడీ ఉద్యోగులను ప్రశంసించక తప్పదని తెలుపుతూ, అంగన్వాడి ఉద్యోగుల రెగ్యులరైజ్ కోసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి న్యాయం జరిగేలా చూస్తామని తెలియజేస్తూ, నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్ని ప్రజలందరికీ గడపగడపకు చేరవేయుటకు ప్రభుత్వ ఉద్యోగులు అత్యున్నత సేవలు  నిర్వహిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారాన్ని అందజేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు, ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల విషయాని ప్రస్తావిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన సాలరీస్ మరియు గత 18 నెలలుగా పెండింగ్లో ఉన్న సప్లమెంటరీ పేమెంట్స్ అన్ని సకాలంలో మంజూరు చేయాలని కోరారు. జిల్లా అంగన్వాడీ ఉద్యోగుల సంఘం పక్షాన గౌరవ ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించి ధన్యవాదాలు అంగన్వాడి జిల్లా అధ్యక్ష కార్యవర్గ బృందం కు సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ , టిఎన్జీవో కేంద్ర బాధ్యులు పోలశ్రీనివాస్, ఎం.సతీష్, సలహాదారులు ఆకుల ప్రసాద్ ,గ్రామ సర్పంచ్ సురేందర్ రెడ్డి , టిఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు గంగా కిషన్, జాఫర్ హుస్సేన్ ,జాకీర్ హుస్సేన్, సంజీవయ్య ,ఉమా కిరణ్, సతీష్, అంగన్వాడి టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు తారగారు, జిల్లా కార్యదర్శి అనురాధ  అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు.