నవతెలంగాణ- పెద్దవంగర: గర్భిణులు, చిన్నారుల కోసం అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని అంగన్వాడీ ఏసీడీపీఓ ఇందిరా అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని అవుతాపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తుందని చెప్పారు. అనంతరం నెలవారీగా గర్భిణులు, చిన్నారులకు అందించే పౌష్టికాహారాన్ని పంపిణీ చేసి సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇంద్రసేనారెడ్డి, అంగన్వాడీ సూపర్వైజర్ కవిత రెడ్డి, ఉపాధ్యాయులు చిరంజీవి, గొట్టిముక్కుల శ్రీనివాస్ రెడ్డి, ప్రతిభ, రంజిత, అంగన్వాడీ టీచర్స్ మంజుల, సునిత తదితరులు పాల్గొన్నారు.