అంగన్‌వాడీల సమ్మె యథాతథం : సీఐటీయూ

Status of Anganwadi strike: CITUనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అంగన్‌వాడీ ఉద్యోగుల సమ్మె యథాతథంగా కొనసాగుతుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కారాములు, పాలడుగు భాస్కర్‌, తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీిఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె సునీత, పి జయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మె విరమించినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదనీ, అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రానందున సమ్మె కొనసాగుతుందని తెలిపారు.